AIKS National Councel meetings at Guntur
పత్రికా ప్రకటనలు వార్తలు

గుంటూరులో 30,31,01 తేదీల్లో జరిగే అఖిలభారత కిసాన్ సభ (AIKS) జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి

తిరుపతి జిల్లా చిట్వేల్ : అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని జిల్లా రైతు సంఘం నాయకులు పందికాళ్ళ మణి కోరారు
మంగళవారం తిరుపతి జిల్లా చిట్వేల్ ఎంపీడీవో మండల కార్యాలయం ఆవరణములో సమావేశాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి ఈ సందర్భంగా పందికాళ్ళ మణి మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి 30 నుండి ఫిబ్రవరి 01 తేదీ వరకు జరుగుతాయని తెలిపారు ఈ సమావేశాలకు మన రాష్ట్రం గుంటూరు నగరానికి 29 రాష్ట్రాల నుండి 300 మంది రైతు ఉద్యమ నాయకులు హాజరవుతారని ఈ సమావేశంలో రైతు సమస్యలు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం మద్దతు ధర ఉచిత పంటల భీమా కౌలు రైతు కార్డులు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మరియు కరువు తుఫాన్ పకృతి వైపరీత్యాలు వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం తదితర సమస్యలపై చర్చిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతుసంఘం నాయకులు ఎం గురవయ్య ఎం ఆనందయ్య షేక్ బురానుద్దిన్ కార్యకర్తలు కే సుధాకర్ ఏ శీను ఏ శీను ఎం చక్రపాణి కార్యకర్తలు పాల్గొన్నారు