తాడేపల్లి లో రైతు సంఘం నాయకులు పర్యటన
తాడేపల్లి హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ గోడ వద్ద మురుగు వర్షపు నీరు పోక ఉండవల్లి, తాడేపల్లి, నులకపేట ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. సుమారు 150 ఎకరాల వ్యవసాయ భూమి ముంపుకు గురవుతుంది గతంలో ఈ డ్రైనేజీ కాల్వను పూడికలు తీసి వర్షపు నీరు ప్రవాహానికి అంతరాయం లేకుండా ఉండేది .ప్రస్తుతం గోడ ఆటంకంగా ఉండి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆవరణ లోపల ఉన్న డ్రైనేజీ మొక్కలు తూటి కాడ గుర్రపు డెక్క మేటలు వేసి తీవ్ర ఇబ్బందికరంగా మారింది తక్షణమే డ్రైనేజీ బోర్డు వారు స్పందించి ఈ ఎండాకాలంలోనే వర్షపు నీరు పోయే డ్రైనేజీ లో లో పూడిక తీసి మొక్కలను నిర్మూలించి ప్రవాహానికి ఆటంకం లేకుండా తాడేపల్లి రైల్వే ట్రాక్ ఆరు తూముల కింద నుండి బకింగ్ కామ్ కెనాల్ వరకు డ్రైనేజీ రిపేర్ చేయించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్ రావు డిమాండ్ చేశారు అలాగే తాడేపల్లి ఐఓసీ వద్ద పాత జిఎన్టి రోడ్డు నుండి యూటీకే పంట కాలువ పక్కన రోడ్డు నిర్మాణం చేపట్టవలసినదిగా అలాగే నూతనంగా నిర్మించిన గుంటూరు రైల్వే ట్రాక్ కింద అండర్ పాస్ నీటితో నుండి రైతుల రాకపోకలకు తీవ్ర అంతరాయం గా మారింది రైతులు పండించిన పంటలను తీసుకురావడంలో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున తక్షణమే ఏపీఎస్ ఐడీసీ స్పందించి తారు రోడ్డు నిర్మాణం చేపట్టవలసిందిగా రైతు సంఘం తాడేపల్లి అధ్యక్షులు మోదుగుల శ్రీనివాసరెడ్డి కోరారు ఈ పర్యటనలో రైతు సంఘ నాయకులు రైతాంగం దొంతి రెడ్డి వెంకటరెడ్డి మేక అమరారెడ్డి తమ్మ నారాయణరెడ్డి సాంబిరెడ్డి దాసరి నవీన్ రమేష్ బుర్రముకు రాజశేఖర్ రెడ్డి భీమిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు